Bala Raju September 2, 2026andhra pradesh, AP news, prabhanews.com, Telangana
ప్రజలకు సేవ చేయాలనే పవన్ నిబద్ధతపై మెగాస్టార్ ప్రశంసలు
Birthday Wishes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి, నిబద్ధతను చిరంజీవి కొనియాడారు.
గ్రామాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ అంకితభావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు తనకు ఎంతో గర్వంగా ఉందని చిరంజీవి తెలిపారు. ప్రజా సేవలో పవన్ కళ్యాణ్ మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
