Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

బోనాలు ఊరేగించి.. మొక్కులు చెల్లించి..

Sowjanya Anneboina August 30, 2026prabhanews.com

నుమకొండ/శాయంపేట, ఆంధ్రప్రభ: మండలంలోని మైలారం గ్రామంలో పోచమ్మ బోనాల ఉత్సవాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

డప్పుచప్పుళ్లు, సంప్రదాయ వాయిద్యాల నడుమ మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పోచమ్మ తల్లిని ప్రార్థించారు. బోనాల వేడుకలతో మైలారం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News