Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

చదువే లక్ష్యంగా.. చిన్నారులకు యూనిఫార్మ్‌లు

Bala Raju September 3, 2026prabhanews.com, Telangana, TG News

నల్లబెల్లి, సెప్టెంబర్‌ 3 (ఆంధ్రప్రభ): విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని గ్రామ సర్పంచ్ రమేశ్ ఆకాంక్షించారు.

దస్తగిరిపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు యూనిఫార్మ్‌లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి గ్రామస్థులు సహకరించాలని సూచించారు. అనంతరం గ్రామ కార్యదర్శి శ్రవణ్‌తో కలిసి విద్యార్థులకు యూనిఫార్మ్‌లను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్, సీఆర్‌పీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News