Bala Raju October 23, 2026prabhanews.com
లక్షెట్టిపేట ఎంఈఓ శైలజ
లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అమీన్‌పూర్ గ్రామానికి చెందిన మేకల్ మాణిక్యమ్మ (100) శత వసంతాల వేడుకలను శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకున్న ఆమె, కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా గడుపుతుండటంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. మాణిక్యమ్మకు ఆరుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె ప్రస్తుతం తన మనవళ్లు, మునిమనవళ్లతో కలిసి ఆనందంగా కాలం గడుపుతున్నారు. వందేళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉంటూ తన పనులను తానే చేసుకుంటుండటం కుటుంబ సభ్యులలో విశేష ఆనందాన్ని నింపుతోంది.
జీవితంలో ఎన్నో అనుభవాలను చూసిన మాణిక్యమ్మ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు అత్యంత ఆప్యాయంగా జరుపుకున్నారు. మూడు తరాల కుటుంబ సభ్యుల నడుమ ఆమె పుట్టినరోజు వేడుకలు ఎంతో సందడిగా సాగాయి. బంధువులు, ఆత్మీయులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వందేళ్ల వయసులో కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య ఆనందంగా జరుపుకున్న మాణిక్యమ్మ శత వసంతాల వేడుక గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
