Nagamani Malligari October 4, 2026prabhanews.com
ఉమ్మడి జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు ముగింపు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా ఊట్కూర్ సర్పంచ్ ఎం.రేణుక భరత్, జిల్లా క్రీడల అధికారి శెట్టి వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
రెజ్లింగ్ వంటి క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అధ్యక్షుడు నర్సిములు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, దాతలు ఎం.విజయకుమార్, బ్రహ్మానందరాజు, మునీర్ అహ్మద్, పీడీలు సాయినాథ్, పారిజాత, బాలరాజు, రామకృష్ణ, రవికుమార్, నరసింహారెడ్డి, వెంకటేష్, సౌమ్య, సీనియర్ క్రీడాకారులు జగదీష్‌గౌడ్, వెంకటేష్‌గౌడ్, లక్ష్మణ్, బాలాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
