Sowjanya Anneboina October 4, 2026prabhanews.com
- దేహదారుఢ్యానికి క్రీడలు అవసరం
- ప్రభుత్వ విప్ విజయరమణారావు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-11, అండర్-14 బాలబాలికల 70వ ఎస్‌జీఎఫ్ కరాటే సెలక్షన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ.. విద్యార్థుల దేహదారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు.
గ్రామీణ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడల్లో పెద్దపల్లి ప్రాంతానికి చెందిన విద్యార్థులు, యువకులు ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ఎస్‌జీఎఫ్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి జిల్లా పేరును నిలబెట్టాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కరాటే ఉపాధ్యాయులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
