Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

చెక్కపెల్లి కుంట వద్ద రోడ్డుపై పడ్డ చెట్టు..

Sowjanya Anneboina September 23, 2026prabhanews.com

  • రోడ్డు జామ్ ఇరుపక్కల నిలిచిన వాహనాలు..
  • వాహనాల రాకపోకలకు అంతరాయం..
  • క్లియర్ చేయించిన స్థానిక ఎస్సై..
  • ఎస్సైకి జనం ప్రశంసలు..

జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం మండలంలో బుధవారం సాయంత్రం 6:30 గంటలకు కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు పడి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. మండల కేంద్రంలోని చెక్కపల్లి కుంట, గ్రీన్ మూన్ దాబా సమీపాన ప్రధాన రహదారిపై ఓ చెట్టు అడ్డంగా పడడంతో ఇరుపక్కల కిలోమీటర్ పొడవున వాహనాలు భారీ సంఖ్యలో ఎక్కడికి అక్కడే నిలిచి, ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు.విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో ప్రయాణికులు,జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్, పోలీసులు ఓ జెసీబీని తెప్పించి చెట్టును పక్కకు తొలగించడంతో నిలిచిన వాహనాల పునరుద్ధరణ జరిగింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో చిమ్మ చీకట్లో పలు గణేష్ మండపాల భక్తులు వాహనాల్లో వినాయక విగ్రహాలను బాజా భజంత్రీల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా శోభయాత్ర కొనసాగుతుంది. ఆ చెట్టును తొలగించి వాహనాల రాకపోకలను ఉపయోగించిన ఎస్సై ని, పోలీసులను పలువురు జనం ప్రశంసించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News