Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

చెన్నూరులో ఘనంగా వైఎస్సార్‌ వర్ధంతి వేడుకలు

Nagamani Malligari September 2, 2026prabhanews.com

చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి.. అనాథాశ్రమంలో అన్నదానం

చెన్నూర్, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను స్థానిక క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం స్థానిక సత్యసాయి సేవా సమితి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, 108 వంటి సేవలు ప్రజలకు అందించిన విశిష్ట కార్యక్రమాలుగా నిలిచిపోయాయని, వైఎస్సార్‌ ప్రజా సంక్షేమానికి చేసిన కృషి చిరస్థాయిగా గుర్తుండిపోతుందని నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో చెన్నూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మ శ్రీనివాస్‌, కౌన్సిలర్లు అంబటి శంకర్‌, ఎండీ అజ్జిమ్‌ ఉద్దీన్‌, చెన్నూరి స్వప్న రాజేష్‌, సుద్దనపల్లి సునీత సుశీల్‌, ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ సాహిర్‌, ఎండీ ఖాజా బేగం ఖలీల్‌, సాధనబోయిన కృష్ణ, చెన్నూర్‌ పట్టణ కన్వీనర్‌ లింగంపల్లి మహేష్‌, ఎండీ బషీర్‌, చీరల సుధాకర్‌రెడ్డి, కుర్మా రాజమల్ల గౌడ్‌, పాతర్ల నాగరాజు, జాడి రాజేందర్‌, జాడి ప్రేమ్‌చంద్‌, దాసరి కమలాకర్‌, ఎండీ హజ్‌, చింతల శ్రీనివాస్‌, చెన్న వెంకటేష్‌, ఎండీ సుల్తాన్‌, ఎండీ అన్వర్‌, తగరం కృష్ణ, తగరం రాము, పోగుల లక్ష్మణ్‌, ఎస్‌కే ఆతీఫ్‌, ఎండీ జావీద్‌, పెండ్యాల శ్రీకాంత్‌, తనుగుల సతీష్‌, రమేష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రవణ్‌రెడ్డి, బెల్లంకొండ జనార్ధన్‌రావు, రాజాగౌడ్‌, ఎండీ సలీం, ఎండీ వహీద్‌, ఎండీ ఇస్మాయిల్‌, భోగి మధు, బీమ్‌ మధు, నేఊరి శేఖర్‌, ఎల్లగౌడ్‌, ఎండీ వసీం, ఎండీ సలీం, చెన్నూరి రాజశేఖర్‌, అట్టెం లక్ష్మీనారాయణ, చింతకింది ప్రశాంత్‌, మంత్రి రాజయ్య, నవీన్‌, సచిన్‌ తదితర కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News