Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
చెన్నూర్, ఆంధ్రప్రభ: ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్ ఆర్థిక భద్రతపై ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల న్యా యమైన డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు, స్థానిక తహసీల్దార్ మల్లికార్జున్, వి. సనత్‌కుమార్, ఆత్రం ప్రహ్లాద్, అజీజ్, పావని, బిక్షపతి, దశరథం, రవిచంద్ర, సుమన్, యాదగిరి, శ్రీలత, ప్రశాంతి, రత్నం తదితర సిబ్బంది పాల్గొన్నారు.
