Rama Rao September 1, 2026Telangana
రుద్రూర్, ఆంధ్రప్రభ: చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు రుద్రూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాలగంగాధర్ తెలిపారు.
ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన లబ్ధిదారులందరూ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్ణీత గడువులోగా అవసరమైన పత్రాలతో స్థానిక సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని ఎంపీడీవో సూచించారు. అర్హత ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బాలగంగాధర్ పేర్కొన్నారు.
