Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Commercial Gas | సెప్టెంబర్‌ ఆరంభంలోనే గ్యాస్‌ షాక్‌..!

Bala Raju September 1, 2026Commercial Gas, prabhanews.com, September

కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు పెంపు..
హైదరాబాద్‌లో రూ.2,996

Commercial Gas | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సెప్టెంబర్‌ నెల ప్రారంభంలోనే గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు షాకిచ్చాయి.

19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లు వంటి వాణిజ్య సంస్థల నిర్వహణ భారం మరింత పెరగనుంది.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం… ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.9.50 పెరిగి రూ.2,747.50కి చేరింది. ముంబైలోనూ రూ.9.50 పెరగడంతో సిలిండర్‌ ధర రూ.2,701కి చేరింది. హైదరాబాద్‌లో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.11 పెరిగింది. దీంతో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.2,985 నుంచి రూ.2,996కి చేరింది. చెన్నైలో రూ.10.50 పెరగడంతో ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.2,916.50గా నమోదైంది.

ఆగస్టు నెలలో కమర్షియల్‌ సిలిండర్‌ ధరను స్వల్పంగా తగ్గించిన చమురు మార్కెటింగ్‌ కంపెనీలు.. సెప్టెంబర్‌ ప్రారంభంలోనే మరోసారి పెంచడం గమనార్హం. తాజా పెంపుతో వాణిజ్య సంస్థలపై ఇంధన వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.994గా కొనసాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News