Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

దేవునిగూడెంలో క్షుద్ర పూజల కలకలం

Sowjanya Anneboina August 29, 2026prabhanews.com

ఇంటి ముందు పూజల ఆనవాళ్లు.. ఆందోళనలో గ్రామస్థులు

దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌ మండలంలోని దేవునిగూడెం గ్రామంలో ఓ ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసిన ఘటన కలకలం రేపింది.

గ్రామానికి చెందిన ఓ ఇంటి వద్ద కొబ్బరికాయలు, మానవుని వెన్నెముక, నిమ్మకాయలు, జిల్లేడు, మర్రి, రాయి, బొమ్మిడి ఆకులను ఓ కర్రకు కట్టి ఉంచారు. తెల్లవారుజామున ఇంటి వద్దకు వచ్చిన బాధిత కుటుంబ సభ్యులకు పూజల ఆనవాళ్లు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు ఈ పూజలు చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది. క్షుద్ర పూజల పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై పోలీసులు దృష్టి సారించి, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News