Sowjanya Anneboina August 23, 2026prabhanews.com
జైనూర్,ఆంధ్రప్రభ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని పంచాయతీరాజ్ డివిజనల్ కార్యాలయం పరిధిలో ఏఈల పోస్టులు సంవత్సరాలుగా ఖాళీగా ఉండడంతో అభివృద్ధి పనుల నిర్వహణలో ఆటంకాలు ఎదురవుతున్నాయని కాంట్రాక్టర్లు, సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు సంబంధించిన పనుల పర్యవేక్షణ బాధ్యతలు ప్రస్తుతం డీఈపై అధికంగా పడుతున్నాయని వారు తెలిపారు.
కార్యాలయ పరిధిలో కార్యాలయ ఏఈతో పాటు మూడు మండలాలకు సంబంధించిన పంచాయతీరాజ్ ఏఈల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో అభివృద్ధి పనుల పరిశీలన, రికార్డుల నమోదు, బిల్లుల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఏఈలు నిర్వహించాల్సిన పలు పనులను డీఈ, కార్యాలయంలోని వర్క్ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అభివృద్ధి పనులు పూర్తయినప్పటికీ రికార్డుల నమోదు, బిల్లుల మంజూరులో ఆలస్యం జరుగుతుండడంతో కాంట్రాక్టర్లు, సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న ఏఈల రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని, అది సాధ్యం కాకపోతే తాత్కాలికంగా ఇన్‌చార్జిలను నియమించాలని వారు కోరుతున్నారు.
