Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఎల్‌నినో ప్రభావంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలి

Bala Raju October 24, 2026prabhanews.com

పంటలకు 9 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి
సీపీఐ నేత పార్థసారథి

తొర్రూరు టౌన్‌, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావంతో నష్టపోతున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, పంట పొలాలకు రోజుకు తొమ్మిది గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి డిమాండ్‌ చేశారు.

శనివారం స్థానిక విశ్రాంతి భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సాగునీరు, విద్యుత్‌ కొరతతో పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అండగా నిలవాలని కోరారు. వరి సాగు చేసిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు, మిర్చి తదితర పంటలు సాగు చేసిన వారికి ఎకరానికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఆరుతడి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను అందించాలని కోరారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని పార్థసారథి విమర్శించారు. ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేసి బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. నవంబర్‌లో ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిటీ మాజీ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు, మండల కార్యదర్శి బందు మహేందర్‌, పట్టణ కార్యదర్శి ముద్రబోయిన వెంకన్న, తెలంగాణ రైతు సంఘం నాయకులు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News