Rama Rao September 1, 2026Telangana
నడిగూడెం, ఆంధ్రప్రభ: కోదాడలో మున్సిపల్ అధికారుల తొందరపాటు చర్యతో ఓ పేద మహిళకు అన్యాయం జరిగిందని విషయం ఎమ్మెల్యే పద్మావతి అమ్మ దృష్టికి రాగానే వెంటనే స్పందించి, ఎలాంటి తారతమ్యాలు లేకుండా, పార్టీలకు అతీతంగా వ్యవహరించారని నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొక్క బిక్షపతి అన్నారు.
పేద మహిళకు న్యాయం జరిగేలా ఆమె బడ్డీ కొట్టును యథాస్థానంలో ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించడం అభినందనీయమన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే పద్మావతి నియోజకవర్గానికి ఆశాజ్యోతిగా నిలుస్తున్నారని మొక్క బిక్షపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
