Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఎంజీ యూత్ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే వేముల

Sowjanya Anneboina August 23, 2026prabhanews.com

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాలపురం పట్టణ పరిధిలోని తొమ్మిదో వార్డులో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంజీ యూత్ కమిటీ సభ్యులు నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన యూత్ కమిటీ సభ్యులను విప్ వేముల వీరేశం శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం యూత్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వేముల వీరేశంను శాలువాతో సన్మానించారు.

యూత్ కమిటీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని వేముల వీరేశం తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఏర్పుల పరమేశం, కో-ఆప్షన్ సభ్యులు, గౌరవ అధ్యక్షుడు బెల్లి సత్తయ్య, అధ్యక్షుడు కంభంపాటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి రవి, కోశాధికారి జడల మహేష్, ఎల్ల మల్లేశం, బి. చంద్రశేఖర్, జంగయ్య, మల్లేష్, తిరుపతి రెడ్డి, బాలకృష్ణ, జి. రవి, బి. నరేష్, మహేందర్ రెడ్డి, బిక్షం, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News