Nagamani Malligari October 24, 2026prabhanews.com
నవంబర్ 15న 'హలో నేతకాని - చలో ఉస్మానియా' కార్యక్రమం
జన్నారం, ఆంధ్రప్రభ : ఎస్సీ వర్గీకరణలో జరిగిన అన్యాయంపై నేతకానీలు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్, నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత అన్నారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా చేపట్టని ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులానికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ అన్యాయంపై నేతకానీలు చేపట్టిన పోరుబాటలో భాగంగా నవంబర్ 15న రాష్ట్రస్థాయిలో 'హలో నేతకాని - చలో ఉస్మానియా' కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో నేతకాని కుల సంఘం మండల అధ్యక్షుడు రత్నం లక్ష్మణ్, డైరెక్టర్ తాళ్లపల్లి రాజేశ్వర్, వైస్ చైర్మన్ బోర్లకుంట ప్రభుదాసు, మాజీ ఎంపీపీ కామెర రవిశంకర్, విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం వినోద్, నాయకులు వెంకటి, వసంత్, మల్లయ్య, నందయ్య, దత్తు, లక్ష్మీరాజం, భాస్కర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
