Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హరీశ్‌రావు ఫైర్..

Pavan Chandragiri September 1, 2026

  • సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారు..
  • తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనకు వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు. కష్టపడి చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో ఉద్యోగ అవకాశాలు, పై చదువులకు వెళ్లే అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

'పేద విద్యార్థుల చదువులపై మీకెందుకంత నిర్లక్ష్యం?' అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను విమర్శించడంపై చూపుతున్న శ్రద్ధ.. విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చూపాలని వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News