Rama Rao September 1, 2026Telangana
పరకాల, ఆంధ్రప్రభ: పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఉదయం ఒకటో వార్డు పరిధిలోని కొత్తకాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు 'మడికొండ బ్రదర్స్' ఆధ్వర్యంలో వార్డు ప్రజల మధ్య కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సమన్వయ కమిటీ సభ్యుడు మడికొండ సంపత్‌కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించారు. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బొచ్చు అంజి, బొచ్చు కిషన్, బొచ్చు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
