Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఘనంగా గణనాధుల నిమజ్జనం

Sowjanya Anneboina September 23, 2026prabhanews.com

  • ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్
  • కొనసాగుతున్న శోభాయాత్రలు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జన వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

శోభాయాత్ర ద్వారా మినీ ట్యాంక్ బండ్ కు చేరిన తొలి వినాయకుడికి నిమజ్జన పూజను ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ క్రేన్ల ద్వారా నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలో పాల్గొని నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా ముగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కమిషనర్ వెంకటేష్, ఏసిపి కృష్ణ తోపాటు కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News