Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఘనంగా ఇర్ఫాని దర్గా 24వ ఉర్సు ఉత్సవాలు

Sowjanya Anneboina October 4, 2026prabhanews.com

  • ప్రత్యేక ప్రార్థనలు చేసిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ - ఖవ్వాలి కళాకారులకు కానుకలు

సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : సంగారెడ్డి పట్టణ శివారులోని ఇర్ఫానీ దర్గా 24వ ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉర్సు ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం దర్గాలో ప్రత్యేక దీపారాధన, ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వహించిన ఖవ్వాలి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉర్సు ముగింపు కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అనంతరం ఖవ్వాలి కార్యక్రమంలో పాల్గొని కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దర్గాలకు కులమతాలకు అతీతంగా ప్రజలు తరలివస్తారని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య సోదరభావం, ఐక్యతను మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో, శాంతియుతంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్ షఫీ అహ్మద్‌, కాంగ్రెస్‌ నాయకుడు కూన సంతోష్‌కుమార్‌, దర్గా నిర్వాహకులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News