Sowjanya Anneboina September 23, 2026prabhanews.com
కరీంనగర్ కల్చరల్,ఆంధ్రప్రభ: తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు, భజనలు, విశేష అభిషేకాలు అందుకున్న బొజ్జ గణపయ్యలకు నవరాత్రులు ముగియడంతో ఘనంగా వీడ్కోలు పలికారు.
బుధవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి చెరువులో గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది.
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్తపల్లి నూతన గణేశ్ నిమజ్జన పాయింట్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. శోభాయాత్రగా తరలివచ్చిన తొలి గణేశ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం క్రేన్ సహాయంతో గణేశ్ విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేసి విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరడంతో భక్తులు భావోద్వేగానికి గురయ్యారు.
