Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఘనంగా వైఎస్సార్‌ వర్ధంతి వేడుకలు

Nagamani Malligari September 2, 2026prabhanews.com

చిట్యాలలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నివాళులు..
సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్న నాయకులు

చిట్యాల, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలను బుధవారం చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దబ్బెట అనిల్‌ వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్‌ పాలన సాగించారని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేశారని గుర్తు చేశారు. రైతుల కోసం రైతు భరోసా, విద్యార్థుల కోసం అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేశారని తెలిపారు.

మహిళల కోసం వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, వృద్ధులు, పేదల కోసం వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, పేదల ఇళ్ల కోసం పేదలందరికీ ఇళ్లు వంటి పలు కార్యక్రమాలను అమలు చేశారని దబ్బెట అనిల్‌ పేర్కొన్నారు. వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పింగిలి జ్యోతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, జిల్లా కార్యదర్శి చిలుకల రాయకోమురు, సర్పంచులు కాసం మాధవి రాజిరెడ్డి, పర్లపల్లి రవి, కొడారి ఓదెలు, యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్‌, మాజీ సర్పంచులు కొక్కుల సదానందం, పట్టణ అధ్యక్షుడు గంగాధర రవీందర్‌, మాజీ ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్‌, గడ్డం కొమురయ్య, బుర్ర లక్ష్మణ్‌ గౌడ్‌, క్యాతం మార్కండేయ, పింగిలి సతీష్‌రెడ్డి, ఆకుల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News