Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
తాడ్వాయి, ఆంధ్రప్రభ: నందివాడ గ్రామానికి వైకుంఠ రథం వితరణ చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విడిసి అధ్యక్షుడు కంకణాల బాలచంద్రం సేటు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని కొనుగోలు చేసి గ్రామపంచాయతీకి అందజేశారు.
గ్రామ ప్రజల సమక్షంలో రథాన్ని పంచాయతీ పాలకవర్గానికి అప్పగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అవసరాన్ని గుర్తించి వైకుంఠ రథాన్ని వితరణ చేసిన బాలచంద్రం సేటు కుటుంబానికి గ్రామపంచాయతీ, ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి కుటుంబాన్ని భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విడిసి అధ్యక్షుడు బాలచంద్రం సేటు, గ్రామ విడిసి కమిటీ పెద్దలు, పంచాయతీ కార్యదర్శి సవిత, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
