Sowjanya Anneboina August 23, 2026prabhanews.com
బిక్కనూర్, ఆంధ్రప్రభ: గుడిసెలేని గ్రామాలే ప్రభుత్వ లక్ష్యమని బిక్కనూర్ పట్టణ సర్పంచ్ బల్యాల రేఖా సుదర్శన్ అన్నారు.
ఆదివారం పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సిద్ధిరామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజబాబు గౌడ్, సొసైటీ అధ్యక్షుడు భూమయ్య, నాయకులు మైపాల్ రెడ్డి, రామచంద్రం, జనార్దన్ రెడ్డి, సాయిలు, మద్దూరి రవి, సిద్ధిరాములు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
