Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

గులాబీమయమైన చెన్నూరు

Nagamani Malligari September 2, 2026prabhanews.com

నిరసన ర్యాలీకి భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు

చెన్నూరు, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రం గులాబీమయమైంది.

రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో సాధించిన ప్రగతి శూన్యమంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ బుధవారం చేపట్టనున్న నిరసన ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద గులాబీ జెండాలను ఏర్పాటు చేసి ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.

స్థానిక తెలుగు తల్లి విగ్రహం నుంచి అంబేద్కర్‌ చౌక్‌ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు నాయకులు సన్నాహాలు చేశారు. చెన్నూరు, కోటపల్లి మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పట్టణానికి తరలివచ్చారు.

దీంతో పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో ఎటుచూసినా గులాబీ జెండాలు కనిపించడంతో చెన్నూరు గులాబీమయంగా మారినట్లు కనిపించింది. ర్యాలీ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News