Pavan Chandragiri August 23, 2026
చింతకాని, (ఆంధ్రప్రభ) : చింతకాని మండలం రామకృష్ణాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు.
గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన జానీపాషా (45) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రామకృష్ణాపురం సమీపంలో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
