Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హలో మాల.. చలో ఢిల్లీ. మహాధర్నాకు భారీగా తరలిరండి

హలో మాల.. చలో ఢిల్లీ. మహాధర్నాకు భారీగా తరలిరండి

Nagamani Malligari August 1, 2026prabhanews.com

ఆగస్టు 10 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు పిలుపు

చ్చంపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న "హలో మాల..

చలో ఢిల్లీ" మహాధర్నాను విజయవంతం చేయాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు.

ఈ మేరకు శనివారం అచ్చంపేట పట్టణంలోని ఆదర్శ్‌నగర్‌లోని మాల మహానాడు భవనంలో సమావేశం నిర్వహించి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అచ్చంపేట నియోజకవర్గంలోని మాలలు పెద్ద సంఖ్యలో ఢిల్లీ మహాధర్నాకు తరలిరావాలని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చట్టంపై తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రోస్టర్ విధానం కారణంగా మాలలకు విద్య, ఉద్యోగాలు, అవకాశాల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారం కోసం అందరూ ఐక్యంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గంధం స్వామి, గోరటి పరుశరాములు, రామస్వామి, అనిల్ కుమార్, కిన్నెర పాండు, బాలచంద్రి, గోరేటి శ్రీనివాసులు, వేదవ్యాస్, నూనె ఆనందు, సుధాకర్ బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News