Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

హన్మకొండకు చేరుకున్న రాష్ట్ర బీజేపీ చీఫ్

Nagamani Malligari September 2, 2026prabhanews.com

పరకాల అమరధామంలో అమరులకు నివాళులర్పించనున్న రామచందర్‌రావు

హన్మకొండ, ఆంధ్రప్రభ : తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా భావించే డెక్కన్ జలియన్‌వాలాబాగ్‌ పరకాల అమరధామం వద్ద అమరులకు నివాళులర్పించేందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు బుధవారం హనుమకొండ జిల్లాకు చేరుకున్నారు.

ఆయన జిల్లాలో పర్యటనకు వచ్చిన సందర్భంగా కాజీపేట బాపూజీనగర్‌ జంక్షన్‌ వద్ద బీజేపీ హనుమకొండ జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు రామచందర్‌రావును కలిసి అభినందనలు తెలిపారు. అక్కడ బీజేపీ వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ పోటీ అభ్యర్థి రావు పద్మారెడ్డి, రామచందర్‌రావుతో కలిసి మాట్లాడారు. అనంతరం రామచందర్‌రావు కాజీపేట నుంచి పరకాలకు బయలుదేరి వెళ్లారు.

పరకాల అమరధామం వద్ద తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రాణత్యాగం చేసిన అమరులకు ఆయన నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News