Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Hardik Pandya | అఫ్గాన్‌ సిరీస్‌కు దూరమేనా..?

Bala Raju September 1, 2026Hardik Pandya, injury, prabhanews.com

Hardik Pandya | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు భారీ షాక్‌ తగిలింది.

అతడు మళ్లీ గాయపడినట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్‌ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు హార్దిక్‌ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హార్దిక్‌ పాండ్యా గత కొన్ని నెలలుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. ఇటీవలే అతడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించినట్లు సీవోఈ వర్గాలు వెల్లడించడంతో.. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని అభిమానులు భావించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రాక్టీస్‌ సమయంలో హార్దిక్‌ కాలికి గాయమైనట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ గాయం కారణంగా అఫ్గానిస్థాన్‌ సిరీస్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే అతడి గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది.

హార్దిక్‌ పాండ్యా చివరిసారిగా 2026 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో టీమిండియా తరఫున ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. రీఎంట్రీకి సిద్ధమవుతున్న సమయంలో మరోసారి గాయం కావడం అతడికి, భారత జట్టుకు ఎదురుదెబ్బగా మారింది.

అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ఈ వారంలో సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. హార్దిక్‌ ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం సెలెక్టర్ల జట్టు ఎంపిక సమయంలో వెలువడే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News