Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హిందూ సమ్మేళన ప్రచార రథ యాత్ర ప్రారంభం

హిందూ సమ్మేళన ప్రచార రథ యాత్ర ప్రారంభం

Sowjanya Anneboina April 30, 2026prabhanews.com

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : మే 3, ఆదివారం సాయంత్రం తొర్రూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన ప్రచార రథయాత్రను కార్యక్రమ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలోని హిందూ వర్గాలు ఐకమత్యంతో ముందుకు వచ్చి ఈ సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ సద్గురు మహాదేవ్ స్వామీజీ ప్రధాన అతిథిగా, తెలంగాణ ప్రాంత కుటుంబ ప్రబోధన్ సహ సంయోజక్ సంకేపల్లి కీర్తన రెడ్డి ప్రధాన వక్తగా పాల్గొననున్నారు.

సమావేశంలో సంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు నిర్వహించబడతాయని, అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి తొర్రూర్ బాధ్యులు గుజరాతి శివకుమార్, ఇమ్మడి రాంబాబు, గంధసిరి వెంకన్న, ప్రొద్దుటూరు రుద్రదేవ్, హరిబాబు, సురేందర్, సోమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News