Pavan Chandragiri August 5, 2026
- ఉచితంగా 20 వేల విమాన టికెట్లు..
- 20 ఏళ్ల సంబరాల్లో ప్రయాణికులకు భారీ గిఫ్ట్..
- రూ.10 వేల వరకు రీఫండ్ అవకాశం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన వాణిజ్య కార్యకలాపాల్లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. 'ఇండిగో ఫ్రీ' పేరుతో 20,000 ఉచిత విమాన టికెట్లు అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, ఈ బంపర్ ఆఫర్ కు రేపే (ఆగస్టు 6) లాస్ట్ ఛాన్స్.
ఆగస్టు 4 నుంచి 6 వరకు సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా దేశీయ విమాన టికెట్లు బుక్ చేసిన అర్హులైన ప్రయాణికులు ఈ ఆఫర్‌కు అర్హులని ఇండిగో తెలిపింది. ఎంపికైన వారికి గరిష్ఠంగా రూ.10,000 వరకు రీఫండ్ అందించనున్నట్లు వెల్లడించింది.
ఈ ప్రత్యేక ఆఫర్‌ను ఇండిగో తన 20 ఏళ్ల విజయవంతమైన ప్రయాణానికి గుర్తుగా, కోట్లాది మంది ప్రయాణికులు చూపిన విశ్వాసానికి కృతజ్ఞతగా అందిస్తున్నట్లు పేర్కొంది. రీఫండ్ పొందే విధానం, అర్హత నిబంధనలు, విజేతల ఎంపిక వంటి పూర్తి వివరాలను త్వరలో అధికారిక వేదికల్లో ప్రకటించనుంది. విమాన ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతో ప్లాన్ చేస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ఇప్పటికే ప్రయాణ ప్రణాళికలు ఉన్నవారు రేపటిలోగా బుకింగ్ పూర్తి చేస్తే ఈ ప్రత్యేక ఆఫర్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
