Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Indigo | గోవాలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్‌.

Bala Raju September 1, 2026Delhi, Goa, IndiGo, prabhanews.com

ఇంజిన్‌లో సమస్య గుర్తింపు..
ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

Indigo | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా తిరిగి గోవాకు మళ్లించారు.

6ఈ 2102 విమానం మంగళవారం ఉదయం గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్యను సిబ్బంది గుర్తించారు.

సమస్యను గుర్తించిన వెంటనే విమాన సిబ్బంది గగనతల నియంత్రణ కేంద్రానికి సమాచారం అందించారు. ఆ సమయంలో విమానం సుమారు 14 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. పరిస్థితిని అంచనా వేసిన అనంతరం విమానాన్ని తిరిగి గోవా వైపు మళ్లించారు.

గోవా విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను విమానం నుంచి దించారు.విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రయాణికుల కోసం విమానయాన సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ విమానం ప్రయాణాన్ని సాయంత్రం 3.30 గంటలకు రీషెడ్యూల్‌ చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News