Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Indrakeeladri | అమ్మవారిని దర్శించండి..

Bala Raju September 30, 2026andhra pradesh, AP news, prabhanews.com

Indrakeeladri | అమ్మవారిని దర్శించండి..

దసరా మహోత్సవాలకు గవర్నర్‌ కు ప్రత్యేక ఆహ్వానం

Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : భక్తి పారవశ్యంతో ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా మహోత్సవాలకు రావాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు దేవస్థానం అధికారులు దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానం పలికారు. అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని, దసరా మహోత్సవ వైభవాన్ని తిలకించి తరించేందుకు తరలిరావాలని ఆకాంక్షించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ను బుధవారం మధ్యాహ్నం కలిసి దసరా మహోత్సవాల ఉత్సవ ఆహ్వానపత్రికను అందజేశారు. దేవాదాయశాఖ కమిషనర్‌ కే. రామచంద్ర మోహన్‌, దేవస్థానం చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్‌, స్థానాచార్య శివ ప్రసాద్‌ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య తదితరులు గవర్నర్‌ను కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధిలో జరిగే దసరా ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో, భక్తిభావంతో నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అమ్మవారి అలంకార దర్శనాలను తిలకించి, దుర్గమ్మ కరుణాకటాక్షాలకు పాత్రులు కావాలని భక్తులకు పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News