Bala Raju August 22, 2026andhra pradesh, ap, AP news
కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రమోద్ సావంత్
Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి ఆలయానికి విచ్చేసిన గోవా ముఖ్యమంత్రికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ అధికారులు ప్రమోద్ సావంత్‌కు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. తర్వాత ఆలయ చైర్మన్, ఈఓ కలిసి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు అమ్మవారి శేషవస్త్రం, పవిత్ర చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.
