Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంద్రకీలాద్రిపై భక్తజనం

ఇంద్రకీలాద్రిపై భక్తజనం

Nagamani Malligari October 4, 2026prabhanews.com

వరుస సెలవులతో కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

శనివారం అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

సెలవులు, వారాంతంతో పెరిగిన రద్దీ

క్రమబద్ధీకరణకు అధికారుల విస్తృత ఏర్పాట్లు

త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు

37,296 మంది భక్తుల రాక

9,720 మందికి అన్నప్రసాదం.. రూ.8.27 లక్షల విరాళాలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మ దర్శనానికి శనివారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరుస సెలవులు, వారాంతపు సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక పెరిగింది. దీంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. రద్దీకి అనుగుణంగా భక్తులను దశలవారీగా క్యూలైన్లలోకి అనుమతిస్తూ త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు.

శనివారం ఆలయ వివరాలు..

ఆలయ రోజువారీ గణాంకాల ప్రకారం అక్టోబర్ 3న 37,296 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం టికెట్ల ద్వారా 10,640 మంది భక్తులు దర్శనానికి వెళ్లారు. అదే రోజు 65,113 ప్రసాద యూనిట్లు భక్తులకు అందించారు. ఆలయానికి రూ.8,27,816 విరాళాలు సమకూరాయి. అదేవిధంగా 376 సేవలు, 1,658 మంది తలనీలాలు సమర్పించినట్లు ఆలయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 9,720 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News