Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ

ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ

Nagamani Malligari June 20, 2026Pledge for a Clean and Golden Andhra

ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో శనివారం "స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ" కార్యక్రమం నిర్వహించారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవస్థానం రాజగోపురం ముందు జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత, ఆలయ స్వచ్ఛతపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News