Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఇంటింటా కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ..

Bala Raju September 3, 2026prabhanews.com, Telangana, TG News

టేకుమట్ల, సెప్టెంబర్ 3 (ఆంధ్రప్రభ) : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సముద్రాల మొండయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ఆయా హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకు బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కార్డులను అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, అనవేన రమేష్, పిపిప్పాల దేవేందర్, రాజయ్య పున్నం కుమార్ చెరుకు రాజేందర్ బచ్చల రమేష్ ఏకు శ్రీనివాస్, కుక్కల తిరుపతి నేరెళ్ల సదయ్య జోడు మొండయ్య పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News