Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 125 రోజుల పని

Bala Raju October 24, 2026prabhanews.com

వీబీజీ రామ్‌జీ పథకంతో గ్రామీణ పేదలకు ఆర్థిక భరోసా

కడెం, ఆంధ్రప్రభ: జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ వీబీజీ రామ్‌జీ పథకం కింద 125 రోజుల ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సూచించారు.

వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గే పరిస్థితుల్లో ఈ పథకం గ్రామీణ పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని తెలిపారు.

శనివారం కడెం మండలం కొండుకూరు గ్రామంలోని ఎస్‌కే ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన జోన్‌-1 స్థాయి అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఉపాధి పనులను వినియోగించుకోవాలని సూచించారు. పనులకు సంబంధించిన కూలీ డబ్బులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నీటి సంరక్షణ, జలవనరుల అభివృద్ధి పనులతో ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులైన వారందరూ ఉపాధి పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్‌, వివిధ మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News