Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా బైరపోగు సాంబశివుడు

Rama Rao August 30, 2026Telangana

చిన్నంబావి, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం బాడుగదిన్నె గ్రామానికి చెందిన బైరపోగు సాంబశివుడును తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు.

ఈ నేపథ్యంలో కొల్లాపూర్‌లో జనసేన పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటూ సాంబశివుడికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బైరపోగు సాంబశివుడు మాట్లాడుతూ, రాజకీయ అవగాహన వచ్చినప్పటి నుంచి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నానని తెలిపారు. జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా లక్ష్యాలను సాధించాలనే తపనతో 2014 నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ శ్రేణులు, కొల్లాపూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ పదవి అప్పగించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శేఖర్ గౌడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News