Rama Rao September 2, 2026Telangana
దేవరకద్రకు తరలిన భూత్పూర్ బీఆర్‌ఎస్ శ్రేణులు
ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలపై ఆందోళన
భూత్పూర్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి భూత్పూర్ నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆల ప్రీతిరెడ్డికి భూత్పూర్‌లో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా దేవరకద్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
