Dailyhunt
కడెంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

కడెంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

Sowjanya Anneboina April 5, 2026prabhanews.com

డెం, ఆంధ్రప్రభ ; మండల కేంద్రమైన కడెంలో బృందావన్ రిసార్ట్ లో ఆదివారం జెడ్ పి ఎస్ఎస్ కడం పాఠశాలలో 1990- 1991 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు.

జ్యోతి ప్రజలను చేసి ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని ప్రారంభించగా విద్యార్థులు తమ అనుభవాలను ఒకరినొకరు పంచుకొంటూ గడపారు.

మళ్లీ అందరూ ఒకే చోట కలవడం చాలా సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు అన్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్లీ అందరూ పూర్వ విద్యార్థులు ఒక చోటికి చేరి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబోధన అందించిన అప్పటి ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News