Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Kalvakuntla Kavitha | ఉద్యోగుల సమస్యలపై కవిత ప్రశ్నలు

Bharath September 1, 2026prabhanews.com

హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మర్చిపోయిందా?

అని టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు.

రాష్ట్ర సచివాలయం ఎదుట ఉద్యోగులు చేపట్టిన నిరసనకు సంబంధించిన దృశ్యాలను కవిత తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పంచుకున్నారు. తమకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్‌ఎస్‌ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సచివాలయం ఎదుట ఆందోళనకు దిగడం కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కవిత ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులతో తక్షణమే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కవిత తన పోస్టులో పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News