Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కంగ్రాట్యులేషన్స్ పీసీఆర్..

Sowjanya Anneboina September 21, 2026prabhanews.com

  • నూతన డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని అభినందించిన జగ్గన్న
  • జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కంగ్రాట్యులేషన్స్ పీసీఆర్ అంటూ నూతనంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకమైన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డిని జగ్గారెడ్డి అభినందించారు. పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డితో కలిసి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డిని సంగారెడ్డి పట్టణంలోని రామ్‌నగర్‌ రామ్‌మందిర్‌లో సోమవారం సాయంత్రం వినాయక మండపంలో
మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డిని జగ్గారెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు.

చంద్రశేఖర్‌రెడ్డిని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ సెప్టెంబర్‌ 19న నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నిర్మలా జగ్గారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా ఏడేళ్లకు పైగా సుదీర్ఘకాలం పనిచేశారని తెలిపారు. ఆమె హయాంలో జిల్లా కేంద్రంలో పార్టీ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించామో, అంతకంటే ఎక్కువగా చంద్రశేఖర్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. నూతన డీసీసీ అధ్యక్షుడికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగాలని జగ్గారెడ్డి కోరారు.
శ్రేణులకు కృతజ్ఞతలు: డీసీసీ అధ్యక్షుడు పీసీఆర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనను డీసీసీ అధ్యక్షుడిగా నియమించడంలో సహకరించిన మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ వెంకటస్వామి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మలా జగ్గారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అధిష్టానానికి ధన్యవాదాలు: ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. తన సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డిపై నమ్మకంతో డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తన సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి ఎంపికకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, జగ్గారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి అందరి సహకారంతో ముందుకు సాగుతామని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News