Bala Raju September 18, 2026prabhanews.com
వైరా, ఆంధ్రప్రభ : వైరా లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ గాంధీచౌక్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం గాంధీచౌక్‌లో కొలువుదీరిన మట్టి గణపయ్యకు విశేష పూజలు చేశారు.
బొజ్జ గణపయ్యకు కరెన్సీతో పూజలు నిర్వహించారు. అనంతరం ఘనంగా మహిళలకు కమిటీ వారి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు. విఘ్ఞేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని భగవంతుని ఆశీస్సులతో ధర్మపరీక్షణ జరుగుతూ సోదర భావం పెంపొందాలని పురోహితులు సురేష్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
