Bala Raju September 1, 2026andhra pradesh, prabhanews.com, Telangana
కర్నూలు శివారులో ఐబీ అధికారుల అదుపులో నూర్ మహమ్మద్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్ కలకలం రేపింది.
సికింద్రాబాద్‌కు చెందిన నూర్ మహమ్మద్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరెస్ట్ అనంతరం అతడిని ప్రత్యేక భద్రత మధ్య హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు అతడిని విచారిస్తున్నట్లు సమాచారం.
నూర్ మహమ్మద్ కర్నూలు నగర శివారులోని గొందిపర్ల గ్రామంలో ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతడి కదలికలపై కొంతకాలంగా నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు.. తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన అనంతరం అతడిని హైదరాబాద్‌కు తరలించి విచారణ చేపట్టినట్లు సమాచారం.
మహమ్మద్‌కు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి.. అతడి కార్యకలాపాలు ఏమిటి అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అతడికి ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
కర్నూలు శివారులోని గొందిపర్ల ప్రాంతంలో ఓ పరిశ్రమలో పనిచేస్తున్న వ్యక్తిని ఐబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే నూర్ మహమ్మద్‌కు సంబంధించిన ఆరోపణలు, అతడికి ఉన్న సంబంధాలపై అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
