Sowjanya Anneboina August 31, 2026prabhanews.com
భూత్పూర్, ఆంధ్రప్రభ: భూత్పూర్ సర్కిల్ కార్యాలయాన్ని మల్టీజోన్-II ఐజీ షానవాజ్ ఖాసిం సోమవారం వార్షిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, క్రైమ్ రికార్డులు, సీసీటీఎన్‌ఎస్ రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు.
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రాత్రి గస్తీ, బీట్ పెట్రోలింగ్, మహిళలు, బాలల భద్రత, వారెంట్ల అమలు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తులో నాణ్యత, సాక్ష్యాల సేకరణ, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తనిఖీలో జిల్లా ఎస్పీ డి. జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణతో పాటు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
