Bala Raju August 29, 2026Khalapur, prabhanews.com
Khalapur | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఖలాపూర్ సమీపంలో ముడి చమురుతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడటంతో భారీ మంటలు చెలరేగాయి.
పూణే నుంచి ముంబై వైపు వెళ్తున్న సమయంలో ఖలాపూర్ సెక్షన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ట్యాంకర్ బ్రేకులు విఫలమవడంతో డ్రైవర్ వాహనాన్ని అదుపులోకి తీసుకోలేకపోయినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో ట్యాంకర్ బోల్తా పడగా, కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో డ్రైవర్ ట్యాంకర్‌లోనే చిక్కుకుపోయాడు.
సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ట్యాంకర్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసినట్లు సమాచారం.
ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద తీవ్రత, డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి, ట్రాఫిక్ పునరుద్ధరణకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
