Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కిష్టాపురం వాగును పరిశీలించిన అధికారులు

Nagamani Malligari August 4, 2026prabhanews.com

ఆక్రమణలపై రెవెన్యూ-ఇరిగేషన్ శాఖల సంయుక్త సర్వేకు హామీ

మునుగోడు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కిష్టాపురం గ్రామ వాగు, వాగు పరివాహక ప్రాంతంలో జరిగిన ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.

గ్రామస్థులు సుమారు 20 రోజుల క్రితం మునుగోడు తహసీల్దార్ ఎన్. నరేష్‌కు వినతిపత్రం అందజేయడంతో స్పందించిన తహసీల్దార్, కిష్టాపురం జీపీఓ ఈశ్వరయ్యతో కలిసి వాగు ప్రాంతాన్ని సందర్శించారు.

వాగు పరివాహక ప్రాంతంలో జరిగిన ఆక్రమణలను ప్రత్యక్షంగా పరిశీలించిన అధికారులు పరిస్థితిని నమోదు చేసి ఇరిగేషన్ శాఖ అధికారులకు సమాచారం అందజేస్తామని తెలిపారు.

రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి వాగు హద్దులను గుర్తించి ఆక్రమణలను తొలగిస్తామని, వాగు పరివాహక ప్రాంతాన్ని కబ్జాల నుంచి విముక్తి చేస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

ప్రభుత్వ భూములు, వాగులు, చెరువుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో గ్రామ సర్పంచ్ మాలుగు శ్రీను, ప్రజాసేవకులు బోయ లింగస్వామి, 7వ వార్డు సభ్యుడు ఆకుల శంకర్, మేకల నరసింహ, మేకల బాలరాజ్, నక్కలగోని గణేష్, బండమీది గోపాల్, బండమీది ముత్తయ్య, నందిపాటి వెంకన్న, మహేశ్వరం శంకరయ్య, బొమ్మకంటి కొండల్, కోనేటి రాములు, పంతంగి మల్లయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News