Sowjanya Anneboina September 23, 2026prabhanews.com
జుక్కల్, కామారెడ్డి,ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని కౌలాస్ నాల ప్రాజెక్టుకు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 458 మీటర్లు(1.237టిఎంసి) కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 250 క్యూసెక్కుల వరదా నీరు వచ్చి చేరటంతో457.83 మీటర్ల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ ఏఈ సుకుమార్ రెడ్డి తెలిపారు.
ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్న దృష్ట్యా రాబోయే 24 గంటల్లో వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని, ప్రాజెక్టు నీటిమట్టం పెరిగితే ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని బట్టి నీరు నిలువ ఉంచి వచ్చిన నీటీని వచ్చినట్టే వరద కాలువ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది.
కాబట్టి వరదా కాలువ పరివాహక ప్రాంతం గ్రామాల్లోని ప్రజలు,రైతులు పశుకాపరులు,మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులు సూచించారు. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వరద నీరు విడుదల చేసే ముందు ప్రత్యేక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుందని, గేట్లు ఎత్తే సమయం,నీటి విడుదల పరిమాణాన్ని కూడా తెలపడం జరుగుతుందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.
